మహాసభ గురించి సంక్షిప్తంగా (History of Mahasabha)
ప్రప్రదమంగా దక్షిణ ఇండియా వైశ్య సంఘం 1-5-1905 వ తేదీన మద్రాసులోని కాశిశెట్టి వీధిలో ప్రారంభింపబడింది. ఆ తరువాత అనేకుల కృషి ఫలితంగా 1906 లో ప్రధమ ఆర్యవైశ్య సమావేశం గుంటూరులో జరిగింది. అనంతరం మన కుల పెద్దల నివిరామ కృషి వలన పలు ప్రదేశాలలో విజయవంతంగా సభలు నిర్వహించడం ద్వారా ఆర్యవైశ్యుల ఐక్యతను ప్రదర్శించి వారిని సమాజాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
కాలక్రమంలో ఆర్య వైశ్య మహాసభ 1938లో శ్రీ దండు పెంటయ్య గారి అధ్యక్షతన నిజాం రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభగా ఆవిర్భవింపబడిన తరువాత 1954లో శ్రీ జూలూరు వీరేశలింగం గుప్త గారి అధ్యక్షతన హైదరాబాద్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభగా రూపాంతరం పొంది తరువాత శ్రీ జూలూరు వీరేశలింగం గుప్త గారు అధ్యక్షులుగా, శ్రీ కె.సి. గుప్త గారు ప్రధాన కార్యదర్శిగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభగా రూపుదిద్దుకొన్నది.
తదుపరి శ్రీ బెల్డె కుమారస్వామి గారు, శ్రీ దండు పెంటయ్య గారు, శ్రీ కల్వ సూర్యనారాయణ గారు, శ్రీ కె.ఆర్. కృష్ణయ్య శెట్టి గారు, శ్రీ శిరినాం సత్యనారాయణ గారు, శ్రీ కాకరపర్తి భావనారాయణ గారు మరియు శ్రీ పచ్చిపులుసు వెంకట సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కొనసాగినది.
శ్రీ గెల్లి నారాయణ శెట్టి, ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) గారు అధ్యక్షులుగా పదవి చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభకు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కొద్ది మంది సభ్యులతో శ్రీ వేలూరు దూర్వాసులు గుప్త గారు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ కె.సి. గుప్త గారు సభ్యులుగా పరిమిత నిబంధనలతో నియమావళి రూపకల్పన చేసి 1968లో రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ వారి వద్ద 325/68గా రిజిస్ట్రేషన్ చేయడమైనది. ఆ తరువాత శ్రీ దండు బాలనర్సయ్య గారు అధ్యక్షులుగా కొనసాగినారు.
1975లో గౌరవనీయులు శ్రీ కొణిజేటి రోశయ్య గారు అధ్యక్షులుగా అధిష్టించిన తరువాత మహాసభను బలోపేతం చేయతలపెట్టి, అధిక సంఖ్యలో మహాసభ జీవిత సభ్యత్వముతో, జీవిత సభ్యత్వ రుసుము మహాసభకు 'శాశ్వత మూలనిధి'గా ఏర్పాటు చేయదలచి, అందుకు అవసరమైన నియమ, నిబంధనలు రూపొందించు నిమిత్తము రాష్ట్ర నలుమూలలా పర్యటించి, రాష్ట్రములోని ఆర్య వైశ్యుల మనోభావములను క్షుణ్ణముగా అధ్యయనము చేసి అనేక మంది ఆర్య వైశ్య పెద్దల సలహాలు సేకరించి, సమగ్రమైన నియమావళి రూపొందించి, నిర్దుష్టమైన సభ్యత్వము ఏర్పాటు చేసి, గ్రామ స్థాయి నుండి మహాసభ స్వరూపమునకు మండల సంఘాలు (ఆనాడు తాలూకా సంఘాలు), జిల్లా సంఘాలు ఏర్పడుటకు పునాది వేసి మహాసభను పటిష్టము చేసినారు. మహాసభ జీవిత సభ్యత్వ రుసుము 'శాశ్వత మూలనిధి'గా ఏర్పాటు చేసి, ఆ సొమ్మును ఎటువంటి పరిస్థితులలోను ఇతర కార్యక్రమములకు ఉపయోగించకుండ 'శాశ్వత మూలనిధి'గా ఉండే విధముగా నియమావళిలో నిర్దుష్టమైన నిబంధన ఏర్పాటు చేసి మహాసభకు గణనీయమైన శాశ్వత మూలనిధి ఏర్పడుటకు దోహదపడినారు.
అప్పటి నుండి శ్రీ కాసంశెట్టి రాధాకృష్ణయ్య గారు, శ్రీ వీరవెల్లి నరసింహారావు గారు, శ్రీ ఎం.వి.ఎన్. బ్రహ్మానందం గారు, శ్రీ జి.వి. గున్నయ్య శెట్టి గారు, శ్రీ జూటూరు వేమయ్య గారు, శ్రీ కె.వి. రమణయ్య గారు, శ్రీ పడుచూరి వెంకటేశ్వర్లు గారు, శ్రీ జయం సుబ్రహ్మణ్యం శెట్టి గారు, శ్రీ గంజి రాజమౌళి గుప్త గారు, శ్రీ మాజేటి పాపారావు గారు, శ్రీ పెసల శ్రీనివాసులు శెట్టి గారు, శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు, శ్రీ వబిలిశెట్టి కనకరాజు గారు, శ్రీ యిమ్మడిశెట్టి కోటేశ్వర రావు గారు, శ్రీ పాలాది మాణిక్య ప్రభు గారు, శ్రీ కాళ్ళకూరి శ్రీరామ నాగేశ్వర రావు (నాగబాబు) గార్ల సారథ్యంలో దినదినాభివృద్ధి నొంది, స్వంత భవనములో ఆఫీసు, వసతి గృహములతో పాటు 60,000 మంది మహిళా సభ్యులతో మొత్తము జీవిత సభ్యత్వము షుమారు 2,60,000 మంది జీవిత సభ్యులు, ఒక కోటి రూపాయలతో శాశ్వత విద్యానిధి గల ఉమ్మడి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభగా అలరారినది.
రాష్ట్ర విభజన అనంతరం 2015 ఏప్రిల్ నెలలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికై నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ మహాసభను పటిష్టపరచుటకు విశేషంగా కృషి చేస్తున్నారు. విభజన నాటికి తెలంగాణ ప్రాంతం సుమారు 95 వేల మంది జీవిత సభ్యులు కలిగి ఉండగా, కొత్తగా 55 వేల మంది జీవిత సభ్యులను చేర్పించడంతో ప్రస్తుతము జీవిత సభ్యుల సంఖ్య 1,50,000 లకు చేరింది.
11/08/2016 న *ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సును* 5000 మందితో గోదావరిఖని, కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కొణిజేటి రోశయ్య గారు తమిళనాడు గవర్నర్ గా విచ్చేయడం జరిగింది.
05/11/2017 లో దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సును 8000 మందితో శంషాబాద్, రంగారెడ్డి జిల్లా లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి MLA బీగాల గణేష్ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
16/02/2019 న తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా ల లో స్థానికంగా జరిగిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల ఎన్నికల్లో విజయం సాధించిన 150 మంది ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
30/09/2023 న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల కుటుంబాలు కోసం ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ధర్నా చౌక్, ఇందిరాపార్క్ వద్ద *ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష* నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 1000 కోట్లు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి 33 జిల్లాల లో ని ఆర్యవైశ్యులందరూ తరలిరావడం జరిగింది.
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 కొత్త జిల్లాలకు అనుభవజ్ఞులైన వారిని కన్వీనర్లుగా నియమించి, వారిచే జిల్లా సంఘాల అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ పూర్తి గావించడమైనది. తదుపరి టర్మ్కు కూడా క్రమం తప్పకుండా జిల్లా సంఘాలకు ఎన్నికలు జరిపించడమైనది. అలాగే అన్ని జిల్లాలలో మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఎన్నికలు జరిపిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా సంఘాలను మరింత పటిష్టపరచడం జరిగింది.
శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు గత 10 సంవత్సరాల నుండి మహాసభ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నందున, జిల్లా ఆర్యవైశ్య సంఘాలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల డిమాండ్ మేరకు 17-3-2026 వ తేదీన జరిగిన రాష్ట్ర మహాసభ అధ్యక్ష ఎన్నికలలో మరలా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతము 3 ప్రధాన ప్రాజెక్ట్లు అయిన
1) హైదరాబాద్, చింతలబస్తీలోని మహాసభ భవనము పునర్ నిర్మాణము,
2) ఉప్పల్ భగాయత్లోని మహాసభకు కేటాయించబడిన 5 ఎకరాల స్థలములో భవనముల సముదాయము నిర్మాణము,
3) తిరుపతిలోని సీతమ్మ భూములలో మహాసభకు కేటాయించిన స్థలములో భవన నిర్మాణము గురించి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగడం అభినందనీయమని యావత్ ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.శ్రీమతి పంగులూరి
రాష్ట్ర కార్యవర్గం / State Committe

Shri Amaravadi Lakshminarayana Gupta
President
.

Shri Kondle Mallikarjuna Gupta
General Secretary

Shri Renukuntla Ganesh Gupta
Treasurer


Vice Presidents

Kailas Srinivas

Kailas Ramachander

Gampa Srinivas

Proddaturi Gauri Shankar

Topaji Anantha Kishan

Vanama Venkateshwarlu

Artham Laxmaiah

Kacham Satyanarayana

K. Sujendra Shetty

Motori Murali

Kalakonda Ramesh chandra




Secretaries

Pasunuri Srinivasulu

Pola Sudhakar

Maachipeddhi Sivakumar

Lakshmi Narasimha Rao

Pendyala Vijay Bhaskar





EC Members

Uppala Haridhar




News/వార్తలు
19/05/2026
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2026- 2028) నియామక పత్రం అందుకున్న శ్రీమతి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి ( రాధ) నిజాంపేట్ వాసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఖైరతాబాద్ రాష్ట్ర కార్యాలయంలో అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి రాయపూడి భవాని, మేడ్చల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్ గుప్తా, వినయ్ కుమార్, స్రవంతి పాల్గొన్నారు.
Contact Us

Mail id : president@tavms.org.
© Copyright Telangana Rashtra Arya Vysya Mahasabha. All Rights Reserved
Designed by Digital Dulesh Marketing Agency, moblie No 7989722925